ఏపీకి దూసుకొస్తున్న ‘మురసు’ తుఫాను

అమరావతి: ఆర్ణాబ్ తుఫాను చేసి వెళ్లిన నష్టాల నుంచి ఇంకా గట్టెక్కముందే.. మరో తుఫాను వేగంగా దూసుకొస్తోంది. గడిచిన 6 గంటల్లో ఈ తుపాను గంటకు 23 కి.మీ. వేగంతో కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాను ఇప్పటికే చెన్నైకి 560కిమీ, విశాఖపట్నానికి 660 కిమీ, మచిలీపట్నానికి 640 కిమీ, నెల్లూరుకు 630కిమీ, ఒంగోలుకు 680 కిమీ. దూరంలో కేంద్రీకృతమైంది. నవంబరు 2వ తేదీ ఉదయానికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఇది బలపడి తీవ్ర తుఫానుగా మారనుంది. అలాగే నవంబరు 2న అర్థరాత్రి సమయంలో నెల్లూరు – నరసాపురం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ తుఫాను ప్రభావంతో రానున్న మూడు రోజులు దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలో వేటకి వెళ్ళరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉంది జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారి ప్రఖర్ జైన్ తెలిపారు.

error: Content is protected !!
Scroll to Top