పులివెందులలో నేను ఓటు వేయడం లేదు : వైఎస్ జగన్

పులివెందుల: స్థానికంగా జరుగుతున్న ఎన్నికల్లో తాను ఓటు వేయడం లేదని మాజీ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పులివెందుల్లో రీపోలింగ్ నిర్వహిస్తేనే తాను మళ్లీ వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకుంటానని తెలిపారు. ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు ఏకంగా పోలీసు శాఖను ఉలిగొప్పి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా చేస్తున్నాడని, ఆ సంఘటలన్నీ చూశాక ఓటు వేయకూడదని నిర్ణయించుకున్నట్లు వైఎస్ జగన్ తెలిపారు, ఇప్పుడు తాను ఓటు వేస్తే, చంద్రబాబు చేసే అరాచకాలకు ఆమోదం తెలిపినట్లు అవుతుందని అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ తో పాటు ఎన్నికల అధికారులు, పోలీసు శాఖ అంతా చంద్రబాబు కనుసన్నల్లో నడుచుకుంటోందని వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలింగ్ కేంద్రాల వద్ద జరిగిన ఘటనలపై హైకోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.

error: Content is protected !!
Scroll to Top