POLITICAL
జగన్పై జమ్మలమడుగు ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు
పులివెందుల: వైఎస్సార్ కడపజిల్లా పులివెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్ పై జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పూలంగళ్ల సర్కిల్ లో కూటమి నేతల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆదినారాయణరెడ్డి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కూటమి బలపరిచిన అభ్యర్థికే ఓట్లు వేయాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పులివెందుల ప్రజలకు అవసరమైన పనులు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి …
బద్వేల్ మున్సిపల్ చైర్ పర్సన్ గా దివ్య తేజ ఏకగ్రీవ ఎన్నిక
బద్వేలు: వైఎస్సార్ కడపజిల్లాలోని బద్వేలు మున్సిపాలిటీకి నూతన ఛైర్మన్ ఎన్నిక పూర్తయింది. బద్వేలు మున్సిపల్ ఛైర్ పర్సన్ కోసం మొత్తం 12 నామినేషన్లు రాగా.. ఇందులో 6 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన ఆరు నామినేషన్లు టీడీపీకి చెందినవి కావడంతో తెలుగుదేశం పార్టీకి చెందిన దివ్యతేజను ఛైర్ పర్సన్ గా అధికారులు ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. బద్వేలు మున్సిపాలిటీలో మొత్తం 40 వార్డులు ఉండగా.. కేవలం 12 నామినేషన్లే దాఖలు …
మేయర్ టీడీపీ అభ్యర్థిగా సువర్ణ
కడప: గత కొద్ది రోజులుగా టీడీపీలోమేయర్ అభ్యర్థిత్వం పై నాటకీయ పరిణామాలు, గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మేయర్ అభ్యర్థిగా పలు పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ఈ ఉత్కంఠకు ఎట్టకేలకు ఎన్టీఆర్ భవన్ తెరదించింది. శుక్రవారం రాత్రి మేయర్ అభ్యర్థిగా డాక్టర్ నెల్లటూరు సువర్ణ పేరును ప్రకటించింది. ఈ అభ్యర్థిత్వంపై పార్టీలో సమ్మతి, అసమ్మతుల పర్వం కొనసాగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. వైసీపీ నుంచి మాజీ డిప్యూటీ మేయర్ బండి …
ఆళ్లగడ్డలో టీడీపీ అరాచకం పై గంగుల ఫైర్
ఆళ్లగడ్డ: పట్టణంలో టీడీపీ శ్రేణులు సాగిస్తున్న అరాచకాలపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ శ్రేణులు అంతలా రెచ్చిపోతున్నా.. అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం వైసీపీ అభ్యర్థి నామినేషన్ పత్రాలను లాక్కొని భూమా అఖిలప్రియ సోదరుడు విఖ్యాత్ రెడ్డి చించివేశారని ఆయన ఆరోపించారు. మరో వైపు టీడీపీ శ్రేణులు రౌడీయిజం, చిల్లర చేష్టలు మానుకోవాలన్న మాజీ ఎమ్మెల్యే గంగుల …
జనసేనకు సీట్లు కేటాయింపుపై మంత్రి గుమ్మడి కంటతడి
విజయనగరం: పార్వతీపురం మన్యం జిల్లాలో మూడు ఛైర్మన్ స్థానాలను జనసేనకు కేటాయించడం పై మంత్రి గుమ్మడి సంధ్యారాణి కంటతడి పెట్టుకున్నారు. పార్టీ సమావేశంలో మాట్లాడిన ఆమె పొత్తు ధర్మం పై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జనసేనకే చైర్మన్ సీట్లన్నీ కేటాయిస్తే.. ఇక పార్టీ కార్యకర్తలకు తాను ఏం సమాధానం చెప్పుకోవాలని ఆమె ఆవేదన వెలిబుచ్చారు. కార్యకర్తలకు పదవులు ఇవ్వలేని పొత్తుధర్మం ఎందుకుని మంత్రి ప్రశ్నించారు. కార్యకర్తలకు తాను సమాధానం చెప్పుకోలేకపోతున్నానని అన్నారు …





