బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని ఓ వ్యక్తి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు జారీ చేసిన రిజర్వేషన్ల జీవోలను పిటిషనర్ సవాలు చేస్తూ పిల్ దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం రిజర్వేషన్లు అమలు చేసే వరకు ఎన్నికలు నిలిపివేయాలని పిటీషనర్ హైకోర్టును ఆశ్రయించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిలుపుదల చేయాలని పిటీషనర్ వేసిన పిల్పై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది. అయితే ఇప్పటికే లోకల్ బాడీ ఎన్నికలు జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్లు కూడా విడుదల చేయడం గమనార్హం.
