ఏపీలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సీసీటీవీ ఫుటేజీని 60 రోజులు భద్రపరుస్తామని ఏపీ ఎన్నికల కమీషనర్ అనిల్ చంద్ర పునేఠ తెలిపారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టే ఖర్చు పరిమితిని కూడా ఆయన వెల్లడించారు. నగర పంచాయతీ పరిధిలో రూ.5 లక్షలు, మున్సిపాలిటీ రూ.7.5 లక్షలు, కార్పొరేషన్ రూ.10 లక్షలు, జీవీఎంసీ రూ.15 లక్షలు, జీవీఎంసీ మేయర్ రూ.40 లక్షలు, ఇతర మేయర్లు రూ.25 లక్షలు ఖర్చు చేయవచ్చని తెలిపారు. పరిమితికి మించి ఖర్చు చేస్తే చర్యలు తప్పవన్నారు.


