బెంగళూరు పబ్ లో రచ్చరచ్చ చేసిన కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ ను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన సెక్రటరీ సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు వికాస్ మర్మత్ ను జనరల్ అడ్మినిస్ట్రేషన్ లో రిపోర్టు చేసుకోవాలని సూచించారు. ఆయన స్థానంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ కు కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా బాధ్యతలు అప్పగించారు. వికాస్ మర్మత్ పబ్ లో తాగి పోలీసు అధికారులతో గొడవకు దిగి, రచ్చ చేయడంతో సీరియస్ అయిన ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న కారణంతోనే ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.
