అమరావతి: మురసు తీవ్ర తుపాను దృష్ట్యా ముందస్తు సహాయక చర్యల కోసం 17 జిల్లాలకు ఏపీ ప్రభుత్వం రూ.37 కోట్లు విడుదల చేసింది. తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న నెల్లూరు, ప్రకాశం, మార్కాపురం, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాలకు రూ.3 కోట్ల చొప్పున, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, చిత్తూరు, నంద్యాల జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున, కడప, సత్యసాయి, అన్నమయ్య జిల్లాలకు రూ.కోటి చొప్పున నిధులు విడుదల చేసింది. పునరావాస శిబిరాలకు ముంపు ప్రాంత బాధితుల తరలింపు, తాగునీటి సరఫరా, ఆహారం, పాలు, ఆరోగ్య శిబిరాలు, పారిశుద్ధ్యం, రోడ్లు, ఇరిగేషన్ కోసం అత్యవసర రిపేర్లు, విద్యుత్ ప్రత్యామ్నాయ జనరేటర్లు, కొవ్వొత్తుల వంటివాటి సరఫరా కోసం ఈ నిధులను వినియోగించాలని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.







