- ప్రజలను హెచ్చరించిన జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి
కడప: సామాజిక మాధ్యమాల్లో జిల్లా కలెక్టర్ పేరుతో పేక్ అకౌంట్ల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి తప్పుడు మెసేజీలకు ఎవరూ స్పందించవద్దని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి మంగళవారం ఒక ప్రకటన ద్వారా ప్రజలను హెచ్చరించారు. తాజాగా తన పేరుతో వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ద్వారా డబ్బులు అడుగుతున్నట్లు కూడా తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి ఫేక్ అకౌంట్ల రిక్వెస్టులకు ఎవరూ కూడా స్పందించ వద్దని జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజలను హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి మెసేజీలు ఎవరికైనా వస్తే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలియజేయాలని ఆయన తెలిపారు. సైబర్ నేరాలపై జిల్లా సైబర్ పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా ఉంచిందని నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.







