బద్వేలు: వైఎస్సార్ కడపజిల్లాలోని బద్వేలు మున్సిపాలిటీకి నూతన ఛైర్మన్ ఎన్నిక పూర్తయింది. బద్వేలు మున్సిపల్ ఛైర్ పర్సన్ కోసం మొత్తం 12 నామినేషన్లు రాగా.. ఇందులో 6 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన ఆరు నామినేషన్లు టీడీపీకి చెందినవి కావడంతో తెలుగుదేశం పార్టీకి చెందిన దివ్యతేజను ఛైర్ పర్సన్ గా అధికారులు ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. బద్వేలు మున్సిపాలిటీలో మొత్తం 40 వార్డులు ఉండగా.. కేవలం 12 నామినేషన్లే దాఖలు కావడం, అందులోనూ టీడీపీకి చెందిన నామినేషన్లు మాత్రమే చెల్లుబాటు కావడం విశేషం.






