మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్ అరెస్టు..
కడప: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో.. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే కడప నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కడప నగరంలోని 61, 62వ డివిజన్ల పరిధిలో పోలింగ్ కేంద్రాల వద్ద వైఎస్పార్సీపీ ఏజెంట్లకు భద్రత లేకుండా పోయిందని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. పోలింగ్ విధుల్లో భాగంగా బూత్ల వద్దకు వెళ్లిన వైఎస్పార్సీపీ ఏజెంట్లపై టీడీపీకి చెందిన కొందరు వ్యక్తులు దాడులకు పాల్పడటంతో, పోలింగ్ కేంద్రాల నుంచి వైఎస్సార్సీపీ ఏజెంట్లు ప్రాణభయంతో బయటకు పరిగెత్తారు. ఈ ఘటనపై బాధిత ఏజెంట్లకు న్యాయం చేయాలని కోరుతూ కడప నగర మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్ తాలూకా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు స్పందించకపోగా.. ఫిర్యాదు చేసిన తనను ఇంటి వద్దకే వచ్చి పోలీసుల బలవంతంగా అరెస్టు చేయడం దారుణమని పాకా సురేష్ తెలిపారు. పోలీసు శాఖను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం అడ్డగోలు గెలుపు కోసం యత్నిస్తోందని ఆయన మండిపడ్డారు.






