వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు పంచాయతీరాజ్ డివిజన్ లో రూ.8.56 కోట్ల నిధుల దుర్వినియోగం కేసులో పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. ఇందులో విశ్రాంత ఈఈ సుందర్ రాజు, డీఏవో సుధాకర్, టైపిస్ట్ భాస్కర్, కంప్యూటర్ ఆపరేటర్ షాహిర్ హుస్సేన్ ను అరెస్టు చేశారు. 2022-25 మధ్య వీరు ఓచర్లు, రికార్డులను మార్చి నిధులు దారి మళ్లించినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో జమ్మలమడుగు-తాడిపత్రి బైపాస్ రోడ్డు సమీపంలో ఈ నలుగురిని సీఐ నరేష్ బాబు అరెస్టు చేశారు. వీరి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
₹8.56 కోట్ల దుర్వినియోగం.. నలుగురు అరెస్టు
By
Reporter - Jammalamadugu
/ October 15, 2026





