వైఎస్ జగన్ హెలికాప్టర్‌కు ల్యాండింగ్ అనుమతి నిరాకరణ!

పులివెందుల: స్థానిక సంస్థ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి బెంగళూరు నుంచి పులివెందుల బయలుదేరి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హెలికాప్టర్‌కు అధికారులు ల్యాండింగ్ అనుమతి నిరాకరించారని వైసీపీ నేతలు ఆరోపించారు. ల్యాండింగ్ కు అనుమతి లేకపోవడంతో 20 నిమిషాల పాటు హెలికాప్టర్ గాల్లోనే చక్కర్లు కొట్టిందని, చివరకు ఇంధనం సరిపోకపోవడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చినట్లు వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వైఎస్ జ‌గ‌న్‌ను పులివెందుల‌లో అడుగు పెట్ట‌నివ్వ‌కూడ‌ద‌నే కుట్ర‌లో భాగంగానే ఆయ‌న ప్ర‌యాణిస్తున్న హెలికాఫ్ట‌ర్‌కు అనుమ‌తి నిరాక‌రించార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్పీపీ అధినేత పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వైసీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.

error: Content is protected !!
Scroll to Top