అమరావతి: ఏపీలో ఆర్ణాబ్ తుఫాను ధాటికి దెబ్బతిన్న ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం వ్యక్తిగత కార్యదర్శి పర్యటనకు సంబంధించిన వివరాలను విడుదల చేశారు. గురువారం మధ్యాహ్నం 12:10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 12:55 గంటలకు కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామానికి సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. ముందుగా వెట్లపాలెంలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి, సమస్యలపై రైతులతో సీఎం నేరుగా మాట్లాడనున్నారు. తరువాత కాట్రేనికోన మండలం గచ్చకాయలపోరా పునరావాస కేంద్రంలో తుఫాన్ బాధితులను కలిసి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని బాధితులకు భరోసా ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 2:35 గంటలకు పర్యటన విశేషాలపై చంద్రబాబు మీడియాతో మాట్లాడనున్నారు. అనంతరం సాయంత్రం 4:25 గంటలకు తిరుగు ప్రయాణమై ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.







