అమరావతి: ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ వ్యవహారంలో ఈడీ పీఎంఎల్ఏ చట్టం కింద కేసు నమోదు చేసింది. ఏపీపీఎస్సీ మాజీ అదనపు కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులుతో పాటు పలువురి పేర్లను ఇందులో చేర్చింది. 84 రోజుల పాటు జవాబు పత్రాలు ఓ ప్రైవేట్ ఏజెన్సీ వద్దే ఉన్నట్లు సిట్ దర్యాప్తులో వెల్లడికావడం, అర్హత లేని 66 మందితో మూల్యంకణం చేయించారన్న ఆరోపణలు, ముందే నిర్ణయించిన మార్కులను తగిన పర్యవేక్షణ లేకుండా ఓఎంఆర్ షీట్లకు బదిలీ చేశారన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది.
‘గ్రూప్-1 మెయిన్స్’ మూల్యాంకనం పై ఈడీ దర్యాప్తు
By
Reporter - Amaravathi
/ October 16, 2026





