ఏపీలో ఎన్నికల పరిశీలకుల నియామకం

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం 28 మంది ఐఏఎస్ అధికారులను పరిశీలకులుగా నియమించింది. నిష్పక్షపాతం, పారదర్శకంగా ఎన్నికలు జరపాలని అధికారులకు ఏపీ ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా సూచించారు. రాజకీయ ప్రతినిధుల కోడ్‌, నిబంధనల ఉల్లంఘనలపై తగిన చర్యలతో పాటు, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకుంటూ జిల్లా పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఒత్తిళ్లు, ప్రలోభాలకు తావులేకుండా చూడాలన్నారు.

error: Content is protected !!
Scroll to Top