కడప: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగే.. విజయదశమి అని, ఈ పండుగ జిల్లా ప్రజలందరికీ విజయాలు చేకూర్చాలని ఆకాంక్షిస్తూ.. జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. దుష్ట శక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి నిదర్శనంగా జరుపుకునే ఈ విజయదశమి పండుగ.. అందరికీ మంచి చేకూర్చాలని.. సకాలంలో మంచి వర్షాలు కురిసి.. జిల్లాలో పంటలు సమృద్ధిగా పండాలని, అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధి పథంలో నడవాలని, శాంతి, సౌభాగ్యాలు, సుఖ సంతోషాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలని ఆయన ఆకాంక్షించారు.






