యూట్యూబర్లు హద్దు మీరితే చర్యలు తప్పవు

కడప: జిల్లాలో రేపు జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మీడియా ప్రతినిధులకు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కీలక సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద యూట్యూబ్ ఛానళ్ల పేరుతో అనవసర హంగామా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ అక్రిడిటేషన్ కార్డుతో పాటు ఎన్నికల కమిషన్ జారీ చేసిన పాస్ ఉన్న జర్నలిస్టులకు మాత్రమే పోలింగ్ కేంద్రాల వద్దకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లాలోని పోలీసు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. నిబంధనలు ఉల్లంఘించి హద్దులు దాటితే చట్టపరంగా చర్యలు తప్పవని డీఐజీ కోయ ప్రవీణ్ హెచ్చరించారు.

error: Content is protected !!
Scroll to Top