మైదుకూరు: మైదుకూరు మున్సిపల్ చైర్మన్ పదవికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ధనపాల జగన్ నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో శనివారం నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సందర్భంగా ధనపాల జగన్ మాట్లాడుతూ.. గతంలో తాను గెలిచినా కొందరు తనకు తీరని అన్యాయం చేశారని అన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో తనకు ఛైర్మన్ అభ్యర్థిగా అధికారపార్టీ తరపున అవకాశం వచ్చిందని, తనను గెలిపించి న్యాయం చేయాలని ధనపాల జగన్ చేతులెత్తి వేడుకున్నారు.






