కమలాపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జి పి.నరేన్ రామాంజులరెడ్డిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేయడానికి యత్నించారు. నరేన్ రెడ్డికి ప్రత్యర్థుల నుండి త్రెట్ ఉందన్న నెపంతో పార్టీ కార్యాలయంలో ఉన్న ఆయనను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసుల చర్యలను వైసీపీ శ్రేణులు తీవ్రంగా ప్రతిఘటించారు. వైసీపీకి చెందిన ఛైర్మన్ అభ్యర్థితో ప్రశాంతంగా నామినేషన్ వేయిస్తే తాను పార్టీ ఆఫీసులోనే కూర్చొంటానని నరేన్ రెడ్డి పోలీసులకు స్పష్టం చేశారు. అయినా పోలీసులు వినకపోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
కమలాపురంలో బలవంతపు అరెస్టుకు పోలీసుల యత్నం!
By
Reporter - Kamalapuram
/ October 17, 2026





