సుప్రీంకోర్టు పేరుతో సైబర్ మోసం!

ఢిల్లీ: మోసానికి కాదేది అనర్హం అన్నట్లు సైబర్ మోసగాళ్లు ఏకంగా సుప్రీం కోర్టు పేరుతో నకిలీ వెబ్ సైట్ ను తయారు చేశారు. http://scigovinjudicial.com పేరుతో సైబర్ మోసగాళ్లు మోసపూరిత వెబ్‌సైట్ ను క్రియేట్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సిద్దపడ్డారు. నకిలీ వెబ్ సైట్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సుప్రీం కోర్టు రిజిస్ట్రీ పబ్లిక్ నోటీసును విడుదల చేసింది. వ్యక్తిగత, ఆర్థిక వివరాలు వెల్లడించవద్దని ఆ నోటీసులో పేర్కొంది. సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్ `http://sci.gov.in` మాత్రమేనని స్పష్టీకరణ చేసింది. ఆన్ లైన్ ద్వారా ఏదైనా సమాచారం ఇచ్చే ముందు వెబ్‌సైట్ ప్రామాణికతను తనిఖీ చేసుకోవాలని సుప్రీం కోర్టు రిజిస్ట్రీ పేర్కొంది. సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

error: Content is protected !!
Scroll to Top