50 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగంలో జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం
మైదుకూరు: చాపాడు మండలంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన ఎస్జీఎఫ్ (SGF) అండర్–17 జిల్లా స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో మహాత్మా జ్యోతిబాపూలే బాలికల పాఠశాల విద్యార్థినులు ప్రతిభ కనబరిచారు. 50 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగంలో ద్వితీయ స్థానం సాధించి పాఠశాలకు గుర్తింపు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థినుల ప్రతిభను పాఠశాల ప్రిన్సిపల్ నిర్మలమ్మ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు..






