సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.. ఓటర్లకు ధన్యవాదాలు

మైదుకూరు 12వ వార్డు కౌన్సిలర్ కోనా సుబ్బారావు వెల్లడి

మైదుకూరు: మున్సిపాలిటీ 12వ వార్డు పురపాలక ఎన్నికలలో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన 12వ వార్డు ప్రజానీకానికి ఆ వార్డు కౌన్సిలర్ కోనా సుబ్బారావు ధన్యవాదాలు తెలిపారు. ​తనపై నమ్మకంతో ఓట్లు వేసి తన గెలుపుకు ముఖ్య కారకులైన ఓటర్లకు, సహకరించిన మైదుకూరు శాసనసభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే దిశానిర్దేశంలో మైదుకూరు నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా కోనా సుబ్బారావు హామీ ఇచ్చారు. ​ఈ విజయం తనది కాదని, 12వ వార్డు ప్రజలదని చెప్పుకొచ్చారు. తన పై ఓటర్లు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడంతో పాటు 12వ వార్డులో మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానన్నారు. తన గెలుపు కోసం రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

error: Content is protected !!
Scroll to Top