పులివెందుల: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై పులివెందుల అర్భన్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. నవంబరు 1న పోలింగ్ రోజు ఎన్నికల ఆర్వో కార్యాలయం వద్ద వైఎస్ జగన్ వైసీపీ ఏజెంట్లతో ధర్నా చేపట్టారు. అయితే వైఎస్ జగన్ చేపట్టిన ధర్నా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో వైఎస్ జగన్ తో పాటు ధర్నాలో పాల్గొన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మరో 70 మందిపై కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది.






