4 వేల అపాయింట్మెంట్లు విడుదల
హైదరాబాదు: పాస్‌పోర్ట్ సేవలకు పెరుగుతున్న డిమాండ్, అపాయింట్మెంట్ల వెయిటింగ్ పీరియడ్‌ను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం నవంబర్ 21న ప్రత్యేక పాస్‌పోర్ట్ మేళా నిర్వహించనుంది. ఈ మేళాలో సాధారణ పాస్‌పోర్ట్, తత్కాల్ పాస్‌పోర్ట్, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (PCC) సేవలకు సంబంధించి సుమారు 4 వేలు అపాయింట్మెంట్లు అందుబాటులోకి తీసుకురానున్నారు. నవంబర్ 3 నుంచి హైదరాబాద్ రీజినల్ పాస్ పోర్ట్ కార్యాలయం పరిధిలోని అన్ని పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు (PSKs), పోస్టాఫీసు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో (POPSKs) ఈ అపాయింట్మెంట్లను బుక్ చేసుకోవచ్చని ఆర్పీఓ అధికారులు తెలిపారు.





