అన్నమయ్య జిల్లాలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో ఓ వ్యక్తి ఓ మహిళను దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. నవీద్ బాష అనే వ్యక్తి కర్ణాటక కోలార్ జిల్లా ముళబాగల్ కు చెందిన ఓ మహిళతో బుధవారం ఓ లాడ్జిలో దిగారు. అర్థరాత్రి సమయంలో ఆ వ్యక్తి ఒక్కసారిగా బీరు బాటిల్ తో ఆ మహిళపై దాడి చేసి హత్య చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తరువాత నవీద్ బాష పోలీసులకు లొంగిపోయాడు. నిందితుడు చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని హత్యకు గల కారణాలను విచారిస్తున్నారు.
