14వ వార్డు కౌన్సెలర్ అభ్యర్థిగా బరిలోకి.. సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి తనని గెలిపించాలని విజ్ఞప్తి
మైదుకూరు: వైఎస్సార్ కడపజిల్లా మైదుకూరులో జర్నలిస్టుగా పనిచేస్తున్న వరకుమార్ ప్రజా సేవలోకి అడుగుపెట్టబోతున్నారు. ప్రజల కోసం సేవ చేయాలనే ఆశయంతో తన వార్డు నుండే మున్సిపల్ కౌన్సెలర్ గా బరిలో దిగారు. మైదుకూరు 14వ వార్డులో అధికార పార్టీ తరపున ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి పిల్లి నాగయ్య పై పోటీలో నిలబడ్డారు. సేవ చేయాలనే తలంపుతో తాను కౌన్సెలర్ స్థానానికి పోటీలో నిలబడ్డానని, తనకు ఓటు వేసి గెలిపించాలని 14వ వార్డు టీడీపీ కౌన్సెలర్ అభ్యర్థి దొండపాటి వరకుమార్ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తన వార్డు పరిధిలో ఇంటింటికీ వెళ్లి సైకిల్ గుర్తు పై ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని, నిత్యం ప్రజాసేవలో ఉంటానని వరకుమార్ హామీ ఇస్తున్నారు.









