పోలింగ్ నవంబర్ 5 , రీపోలింగ్ నవంబర్ 6, ఓట్ల లెక్కింపు నవంబర్ 7న
కడప: పట్టణ స్థానిక సంస్ధల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నవంబర్ 3వ తేదీన జరగనున్న నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ తేదీని నవంబర్ 3 నుంచి 5వ తేదీకి మార్పు చేసినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. అలాగే రీపోలింగ్ తేదీని నవంబర్ 4 నుంచి నవంబర్ 6కు, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన తేదీని నవంబర్ 5 నుంచి నవంబర్ 7వ తేదీకి మార్పు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం సవరించిన నోటిఫికేషన్ జారీ చేసిందని కలెక్టర్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా బుధవారం కలెక్టర్, జిల్లా ఎస్పీ ఎస్పీ షెల్కే నచికేత్, జాయింట్ కలెక్టర్ నిధి మీనా పులివెందులలోని జేఎన్‌టీయూ కళాశాలలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు భద్రతా ఏర్పాట్లను సమీక్షించి, కౌంటింగ్ ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
సవరించిన ఎన్నికల షెడ్యూల్
👉పోలింగ్: 05.11.2026 ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు..
👉 రీపోలింగ్ (అవసరమైతే): 06.11.2026 ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు..
👉 ఓట్ల లెక్కింపు: 07.11.2026 ఉదయం 8 గంటల నుంచి..
👉ఫలితాల ప్రకటన: ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే..







