టీడీపీకి తగిన గుణపాఠం చెపుతాం..

కడప: వైసీపీ శ్రేణులపై దాష్టీకాలకు పాల్పడుతున్న టీడీపీకి తొందరలోనే తగిన గుణపాఠం చెపుతామని వైసీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. గత వైసీపీ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగాయని, అభ్యర్థి ఒక్కరే వెళ్లి నామినేషన్ వేసుకునే స్వేచ్ఛ ఉండేదన్నారు. శుక్రవారం కడప నగరంలో 51వ డివిజన్ కు సంబంధించి నామినేషన్ వేసిన తరువాత ఆర్వో వద్ద నుండి రిసీవింగ్ కాపీని దౌర్జన్యంగా లాక్కొని చించడమనేది టీడీపీ ప్రభుత్వ పరాకాష్టకు నిదర్శనమన్నారు. దౌర్జన్యానికి పాల్పడిన వారిపై కేసు నమోదు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

error: Content is protected !!
Scroll to Top