రాగల 24 గంటల్లో కొత్తగా మరో అల్పపీడనం ఏర్పడనుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా రాబోయే వారం రోజుల పాటు భారీగా వర్షాలు కురుస్తాయని అధికారులు స్పష్టం చేశారు. అక్టోబర్ 15 నుంచి 18వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించనుందని. ఇది తుపానుగా మారే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు.


