మైదుకూరులో ₹1.10 కోట్ల సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

మైదుకూరు నియోజకవర్గానికి చెందిన 85 మంది లబ్ధిదారులకు ₹1,10,52,317 విలువజేసే సీఎం సహాయ నిధి (CMRF) చెక్కులను ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పంపిణీ చేశారు. ప్రొద్దుటూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాధితులకు చెక్కులు అందజేసిన అనంతరం పుట్టా మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య అవసరాలకు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే బాధిత కుటుంబాలకు అండగా నిలవడంలో సీఎం సహాయ నిధి కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.

Scroll to Top