ఫారం – 6తో మళ్లీ ఓటరుగా నమోదు!

  • ఓటు పోయిందన్న భయాందోళన వద్దు
  • పాత ఓటర్లకు ఎన్నికల సంఘం సూచన

న్యూఢిల్లీ: ‘సర్‌’ ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేర్లు లేకపోతే గతంలో నమోదైన ఓటర్లు మళ్లీ నమోదు కావడానికి ఫారం-6ను సమర్పించవచ్చని ఈసీఐ మంగళవారం తెలిపింది. ముసాయిదా సర్‌ జాబితాల నుంచి తమ పేర్లు తొలగించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం నుంచి స్పష్టీకరణ వెలువడింది. ఫారం-6ను సమర్పించడం అంటే తాను మొదటిసారిగా ఓటర్ల జాబితాలో చేరాలని కోరుకుంటున్నట్టు డిక్లరేషన్‌ ఇవ్వడం. ఒకవేళ అది అబద్ధపు డిక్లరేషన్‌ అయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద విచారణకు లేదా చర్యలకు దారితీయవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న సర్‌ ప్రక్రియలో ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేర్లు లేని కొందరు వ్యక్తులు ఫారం-6ని సమర్పించడానికి సంకోచిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని అన్ని రాష్ర్టాల ప్రధాన ఎన్నికల అధికారులకు రాసిన లేఖలో ఈసీ పేర్కొంది. దీనికి కారణం తమ పేరు మొదటిసారిగా ఓటర్ల జాబితాలో చేర్చబడుతున్నదని ఒక నిర్దిష్ట ప్రకటనను(డిక్లరేషన్‌) సమర్పించాల్సి ఉంటుంది. ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేని ఓటర్లు గతంలో నమోదు చేసుకున్నప్పటికీ తుది ఓటర్ల జాబితాలో తమ పేర్లను కొత్తగా చేర్చడానికి ఫారం-6ను సమర్పించవచ్చని ఈసీ స్పష్టం చేసింది.

error: Content is protected !!
Scroll to Top