మున్సిపల్ కౌన్సిలర్లుగా తల్లీకొడుకులు

మైదుకూరు: మున్సిపల్ ఎన్నికల్లో తల్లీకొడుకులు కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. మైదుకూరు మున్సిపాలిటీలోని 25వ వార్డులో బీఎన్ భానునందన్ టీడీపీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే 23వ వార్డు నుంచి భానునందన్ తల్లి బీఎన్ పార్వతి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి 352 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు కౌన్సిలర్లుగా ఎంపిక కావడం పట్ల స్థానికంగా చర్చనీయాంశమైంది.

error: Content is protected !!
Scroll to Top