విజయవాడ: మురసు తుఫాన్ ప్రభావంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా నవంబర్ 2, 3 తేదీల్లో 9 రైళ్లను రద్దు చేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. విజయవాడ, గుడూరు, గుంటూరు, తెనాలి, రేపల్లె, మార్కాపురం రోడ్ మార్గాల్లో నడిచే రైళ్ల సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసింది. ప్రయాణికులు రైళ్ల రద్దును గమనించి తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణీకులకు రీఫండ్ లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని అధికారులు తెలిపారు.







