మైదుకూరు మండల పరిధిలోని రాయప్పగారిపల్లె వద్ద ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఎదురెదురుగా ఢీకొట్టడంతో టిప్పర్ డ్రైవర్ అందులోనే ఇరుక్కుపోగా.. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న డ్రైవర్ తో పాటు మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనా ప్రదేశంలో వన్ వే కావడంతో వాహనాలు ఎదురెదురుగా ఢీకున్నట్లు తెలుస్తోంది. ఘటన పై పోలీసులు కేసు నమోదు చేశారు.


