నెల్లూరు: శ్రీహరికోటలోని షార్ నుంచి ఈ నెల 30న జీఎస్ఎల్వీ-ఎఫ్ 18 రాకెట్ ప్రయోగం చేపట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. ఈ రాకెట్ ద్వారా నావిగేషన్ సేవలకు సంబంధించిన ఎనీవీ- ఎస్-03 రెండో తరం ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనున్నారు. ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ గురువారం రాత్రి 11.51 గంటలకు ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు షార్ నుంచి 19 జీఎస్ఎల్వీ రాకెట్లు ప్రయోగించగా.. ఇది 20వ ప్రయోగం.



