టిటిడి పాలకమండలి స్థానంలో ప్రత్యేక అధికారుల కమిటీ నియామకం

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పదవీకాలం ముగియడంతో, నూతన పాలకమండలి ఏర్పాటు అయ్యే వరకు దేవస్థానం పరిపాలనా బాధ్యతలను నిర్వహించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక అధికారుల కమిటీని ప్రభుత్వం నియమించింది. ఇందులో ముగ్గురు ప్రత్యేక అధికారులు ఉంటారు. కమిటీ ఛైర్మన్ గా ఐఏఎస్ అధికారి, టిటిడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, సభ్యులుగా ఆర్థిక శాఖ ప్రభుత్వ కార్యదర్శి వినయ్ చంద్, రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖ ప్రభుత్వ కార్యదర్శి ఐఏఎస్ కన్నబాబులు నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ చట్టం, 1987లోని సెక్షన్ 137 ప్రకారం ఈ ప్రత్యేక అధికారుల కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ TTD పాలకమండలికి ఉండే అన్ని అధికారాలను వినియోగించడంతో పాటు, పాలకమండలి నిర్వహించాల్సిన అన్ని విధులను నిర్వహిస్తుంది. ఈ ప్రత్యేక అధికారుల కమిటీ ఒక సంవత్సరం పాటు లేదా నూతన పాలకమండలి ఏర్పాటు అయ్యే వరకు, ఈ రెండింటిలో ఏది ముందుగా జరిగితే అప్పటివరకు కొనసాగుతుంది.

error: Content is protected !!
Scroll to Top