ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ

అమరావతి: మురసు తుఫాను తీవ్రతరం దాల్చుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. నిజాంపట్నంలో 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక, వాడరేవు హార్బర్‌లో 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక, మచిలీపట్నంలో 9వ నంబర్ ప్రమాద హెచ్చరిక, కృష్ణపట్నంలో 8వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నాటుపడవలు, బోట్లకు సముద్రంలో అనుమతి లేదని తెలిపారు. తుఫాను తీరం దాటి బలహీన పడేంత వరకూ ఎవరూ చేపల వేటకు వెళ్లరాదని అధికారులు పేర్కొన్నారు.

error: Content is protected !!
Scroll to Top