తీవ్ర తుపానుగా మారిన మురసు

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను తీవ్రరూపం దాల్చనుంది. ఈ అర్థరాత్రి ఒంగోలు సమీపంలో మురసు తుఫాను తీరం దాటే అవకాశం ఉందని ఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రస్తుతం తుపాను నెల్లూరుకు 160 కిమీ., ఒంగోలుకు 210 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై గంటకు 22 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. ఇవాళ, రేపు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. ముురసు తుఫాను నేపథ్యంలో ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి అనిత టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికార యంత్రాంగం 48 గంటల పాటు హై అలర్ట్‌గా ఉండాలని, మత్స్యకారులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

error: Content is protected !!
Scroll to Top