మైదుకూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. ఇటు కూటమి నేతల్లోనూ.. అటు వైసీపీ నేతల్లోనూ ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలన్న దానిపై సందిగ్ధత నెలకొంది. టీడీపీ, జనసేన సమన్వయం పై ఇప్పటికే ఆసక్తి నెలకొనగా.. వైసీపీలో అభ్యర్థిత్వం పై ఉత్కంఠ నెలకొంది. జనసేన అభ్యర్థిగా మాజీ ఆర్మీ కల్నల్ కందనూరు గోపి పేరు తెరపైకి రాగా టీడీపీ, వైసీపీలో మాత్రం ఇంకా అభ్యర్థి ఎవరనేది ఖరారు కాలేదు. అయితే టీడీపీ, వైసీపీలో అభ్యర్థి ఎవరనేది గురువారం సాయంత్రానికి తేటతెల్లమవనుంది.
