ఎన్నికలు నిష్పక్షపాతంగా జరపాలి: కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి

కడపజిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమగ్ర కార్యాచరణతో సిద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సభా భవన్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, జేసీ నిధి మీనా తదితరులు హాజరయ్యారు.

Scroll to Top