ఎన్నికల్లో అభ్యర్థుల భద్రతపై హైకోర్టు కీలక ఆదేశాలు!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నామినేషన్ల దాఖలు నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన వరకు ఎలాంటి భద్రత కల్పిస్తారో పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. నామినేషన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతతో పాటు సీసీటీవీ నిఘా, లైవ్ వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

Scroll to Top