Home

విమానంలో సిబ్బందిని కొరికిన హాలీవుడ్ నటి

హాలీవుడ్ నటి సెల్మా బ్లెయిర్ విమానంలో వీరంగం సృష్టించారు. లాస్ ఏంజెలెస్ నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఫ్లైట్‌లో సిబ్బందిని దుర్భాషలాడటంతోపాటు దాడిచేసి కొరికారు. విమానం దిగాక కూడా ఓ పోలీస్, నర్సుపైనా దాడికి పాల్పడినట్లు కేసు నమోదైంది. పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. నటికి నాడీ సంబంధ సమస్యలు ఉన్నాయని, మందులు తీసుకోకపోవడం వల్లే గందరగోళానికి గురయ్యారని ఆమె తరఫు లాయర్లు తెలిపారు.