ఏపీలో స్థానిక సంస్థల నేపథ్యంలో ఏకగ్రీవం కోసం వార్డు సభ్యుల పదవులను వేలం వేయడం అక్రమమని రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. అక్రమ మార్గంలో ఏకగ్రీవాలకు పాల్పడే దోషులకు ఏడాది జైలు శిక్షతో పాటు ఆరేళ్లు పోటీ చేయకుండా అనర్హత వేటు పడుతుందని ఈసీ స్పష్టం చేసింది. ఈ మేరకు వేలం ఆరోపణలపై విచారణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామంది. ఆరోపణలు వచ్చిన చోట కలెక్టర్ అనుమతి లేకుండా ఏకగ్రీవ ఫలితం ప్రకటించబడదని తెలిపింది. బలవంతపు ఏకగ్రీవాలపై ప్రాథమిక ఆధారాలు లభిస్తే ఆయా వార్డుల్లో ఎన్నికలను నిలిపివేసే అధికారం తమకు ఉంటుందని ఎస్ఈసీ స్పష్టం చేసింది.
